హామీలను అమలు చేయాలి

తహశీల్దార్​ కు వినతిపత్రం సమర్పించిన సీపీఐ

Jul 23, 2024 - 13:30
 0
హామీలను అమలు చేయాలి

నా తెలంగాణ, డోర్నకల్: రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలతో కూడిన వినతిపత్రాన్ని మహాబూబాబాద్​ జిల్లా మరిపెడ మండల తహశీల్దార్​ కు అందజేశారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే అర్హులకు రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా నిధులు, కౌలు రైతులు, వృధ్యాప్య, వితంతు, వికలాంగులకు పింఛన్లను తక్షణమే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

మరిపెడ మండలంలో వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్​ చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో కాలనీలోని రోడ్లు, లైట్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లోకి తొక్కి చూడడం లేదని ఆరోపించారు. రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. 

ఆయా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసిన వారిలో  సహాయ కార్యదర్శి ఎండీ అబ్దుల్​ రషీద్​, యాకన్న, అంజి, దయాకర్​ నారాయణ్​ తదితరులు పాల్గొన్నారు.