2024–25 బడ్జెట్​  రూ. 48.21కోట్లతో విడుదల

2024-25 Budget Rs. Released with 48.21 crores

Jul 23, 2024 - 13:16
 0
2024–25 బడ్జెట్​  రూ. 48.21కోట్లతో విడుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 బడ్జెట్​ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ మంగళవారం విడుదల చేశారు. రూ. 48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను విడుదల చేశారు. 

2024-25 బడ్జె్‌ట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు,  ద్రవ్యలోటు 4.9 శాతం, విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లతో బడ్జెట్​ ను విడుదల చేశారు. 

వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయించారు. 

ఆదాయపన్ను చెల్లింపు..
రూ. 3 లక్షల వరకు పన్ను లేదు. రూ. 3 నుంచి రూ. 7 లక్షల వరకు 5శాతం, రూ. 7 నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం, రూ. 10 నుంచి 12లక్షల వరకు 15 శాతం, రూ. 12 నుంచి రూ. 15 లక్షల వరకు 20శాతం, రూ. 15 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంటే 30 శాతం పన్ను విధించనున్నారు. 

ఉద్యోగాలు ..
ఉద్యోగాలు చేసే వారు వారీ వేతనం రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటే, మొదటిసారి ఈపీఎఫ్​వోలో నమోదు చేసుకున్న వ్యక్తులు మూడు విడతలుగా రూ. 15,000 సహాయం పొందనున్నారు. పన్ను శ్లాబ్‌లో మార్పు వల్ల పన్ను చెల్లింపుదారులు రూ.17500 ఆదా చేసుకోనున్నారు. 

డిడక్షన్​ పెంపు: పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు  పెంచారు.

విద్యారుణం: ప్రభుత్వ పథకాల కింద ఎలాంటి ప్రయోజనం పొందని వారు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ప్రవేశానికి రుణం పొందనున్నారు. ప్రభుత్వం రుణం మొత్తంలో 3 శాతం వరకు ఇస్తుంది. ఇందుకోసం ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులకు అందజేసే ఈ-వోచర్లను ప్రవేశపెట్టనున్నారు.

బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు: ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు, బీహార్‌కు రూ.41 వేల కోట్లు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం.

రైతుల కోసం : 6 కోట్ల మంది రైతుల సమాచారం భూరిజిస్ట్రీలోకి తీసుకురాబడుతుంది. ఐదు రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడతాయి.

యువత కోసం: ముద్ర రుణం మొత్తం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. 500 అగ్రశ్రేణి సంస్థల్లో ఐదు కోట్ల మంది యువతకు ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నారు.

మహిళలు, బాలికలకు: మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు. 

సూర్య ఘర్ ఉచిత విద్యుత్: కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు: రాష్ట్రాలకు 50 యేళ్ల వరకు వడ్డీలేని రుణాలను అందించనున్నారు. 

మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీని తగ్గించారు. 

మూడు కోట్ల ఇళ్లు:  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు కోట్ల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. 

ప్రధాన మంత్రి సడక్ యోజన: ఈ పథకం కింద 25 వేల ఎంపిక గ్రామాల్లో నూతన రహదారులను నిర్మించనున్నారు. 

మౌలిక సదుపాయాలకు రూ. 11.11 లక్షల కోట్లు కేటాయించారు. 

వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 11,500 కోట్లు కేటాయించనున్నారు. అసోం, ఉత్తరాఖండ్​ లకు ఎక్కువ నిధులు కేటాయించారు. 

పట్టణాల అభివృద్ధి: 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాల్లో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. పట్టణాల్లో గృహ నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు కేటాయించారు. 100 పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 

పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు: ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. 

ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీలు: ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ స్కీం ద్వారా సులభ వాయిదాల్లో రుణం అందేలా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో ముద్ర రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. 

తగ్గనున్న వస్తువులు: మొబైల్​ ఫోన్లు, బంగారం, వెండి, ప్లాటినం, మందులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆయా వస్తువుల పై కేంద్రం బడ్జెట్​ లో భారీ ఎత్తున పన్నును తగ్గించింది.

పెరగనున్న ధరలు: టెలికామ్​, ప్లాస్టిక్​ ధరలు పెరగనున్నాయి.