అక్షర యోధుడి అస్తమయం

ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​ సంతాపం

Jun 8, 2024 - 17:34
 0
అక్షర యోధుడి అస్తమయం

నా తెలంగాణ, డోర్నకల్​: అక్షర యోధుడు రామోజీ మృతి పత్రికా రంగానికి తీరని లోటని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. శుక్రవారం రామోజీ మరణవార్త తెలుసుకున్న ఆమె విచారం వ్యక్తం చేశారు. పత్రిక ద్వారా నూతన సమాజ నిర్మాణానికి అక్షరం ద్వారా ప్రయత్నించారని తెలిపారు. ఒక్క పత్రికా రంగంలోనే గాక అనేక వ్యాపారాలను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించాలరన్నారు. అన్ని రంగాల్లోనూ ఆయన నిబద్ధతో పనిచేయడం వల్లే ఆయన స్థాపించిన సంస్థలు నేడు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్​ తో సత్కరించిందని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​ ప్రార్థించారు.