ఎల్​ ఎంవీ డ్రైవర్లకు సుప్రీం ఊరట

Supreme relief for LMV drivers

Nov 6, 2024 - 13:06
 0
ఎల్​ ఎంవీ డ్రైవర్లకు సుప్రీం ఊరట
డ్రైవర్లే ప్రమాదానికి కారణమన్న డేటా లేదు
జీవనోపాధికి సంబంధించినది
సుప్రీం తీర్పుపై ఎల్​ ఎంవీ డ్రైవర్ల హర్షం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లైట్​ మోటార్​ వెహికిల్​ లైసెన్స్​ హోల్డర్లు 7500 కేజీల వరకు బరువున్న రవాణా వాహనాలను నడిపేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పలు ఇన్సూరెన్స్​ సంస్థలు క్లెయిమ్​ లు చెల్లించే విషయమై వినియోగదారుల కోర్టుల ఇచ్చిన తీర్పులపై సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్​ పై బుధవారం సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రమాదాలు పెరిగేందుకు ఎల్​ ఎంవీ లైసెన్స్​ దారులే కారణమని నిరూపించే డేటా ఏదీ లేదని తెలిపింది. ఈ సమస్య డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించినదని న్యాయమూర్తులు అన్నారు. ఎల్​ ఎంవీ డ్రైవింగ్​ లైసెన్స్​ హోల్డర్ల ద్వారా నడపబడుతున్న వాహన ప్రమాద కేసుల్లో బీమా క్లెయిమ్​ లు వివాదాలకు దారి తీసింది. పరిహారం చెల్లించాల్సిందేనని ట్రిబ్యునళ్లు ఇన్సూరెన్స్​ సంస్థలను ఆదేశిస్తున్నాయి. దీంతో ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టుకెక్కింది. ఈ తీర్పుతో ఎల్​ ఎంవీ డ్రైవింగ్​ లైసెన్స్​ కలిగిన డ్రైవర్లకు ఊరట లభించనుంది. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా రావడంలో ఎల్​ ఎంవీ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
సుప్రీంకోర్టు నిర్ణయంతో 7500 కేజీల బరువున్న రవాణా వాహనాలను ఎల్​ ఎంవీ డ్రైవర్లు నడుపుకోవచ్చు. దీంతో ఇటు డ్రైవర్ల జీవనోపాధికి ఢోకా ఉండదు. మరోవైపు ప్రమాదాలు, బీమా క్లైయిమ్​ లలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటే ఆయా సంస్థలకూ చట్టపరమైన ఇబ్బందులు తప్పనున్నాయి.  గతంలో ఈ వాహనాలను నడిపితే, అధికారులో, పోలీసులో జరిమానాలు విధించేవారు. ప్రమాదాలకు గురైతే చట్టపరంగా డ్రైవర్లకు, అధికారులకు, పోలీసులకు, బీమా క్లైయిమ్​ సంస్థలకూ తలనొప్పిగా పరిణమించేది. ఏది ఏమైనా ఎల్​ఎంవీ తీర్పు ఇరువురికి ఆమోదయోగ్యంగా నిలించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.