ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు 

Great Vinayaka Navratri celebrations

Sep 11, 2024 - 17:55
 0
ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు 
నా తెలంగాణ, సంగారెడ్డి: వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్ లో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ దేశ్​ పాండే, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞాలను తొలగించే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడని, ఆయన భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం తెలిసి తెలియక చేసిన దోషాలను తొలగించి కుటుంబంలో సుఖశాంతులను నింపుతాడని అన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు సాయి రెడ్డి, శ్రీకాంత్, హరీష్ రెడ్డి, ప్రతాప్, ఫారుఖ్, సాయికుమార్, మశికర్ తదితరులు పాల్గొన్నారు.