జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం
National Service Scheme Special Camp
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మూడో రోజు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు రైతులకు భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. వయ్యారిభామ వలన కలిగే నష్టాల గురించి ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత పంట పొలాల్లో, ఖాళీ స్థలాల్లో వయ్యారిభామ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పంటలకు, మానవులకు ప్రమాదం కలిగిస్తుంది. ఈ కీటకాల నివారణపై అవగాహన కల్పించారు. భూసార ఆవశ్యకతను రైతులకు వివరించారు. రెండేళ్లకోసారి రైతులు భూసార పరీక్షలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక శిబిరంలో విద్యా వాలంటీర్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ గణపతి షుగర్స్ కెన్ లిమిటెడ్ ను సందర్శించారు. అక్కడ విద్యార్థులకు పరిశ్రమలో చెరుకునుంచి ఏ విధముగా పంచదార తయారు చేస్తారో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు, డాక్టర్ ఉపేందర్, డాక్టర్. సుమాలిని, డాక్టర్. రంజిత, 132 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.