నా తెలంగాణ, మెదక్: మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుంచి అనుమతి లభించడంతో మెదక్ ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ను పలువురు అభినందనలతో ముంచెత్తారు. బుధవారం మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ లోని మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందువరుసలో ఉంచుతానని అన్నారు. అదే విధంగా మెడికల్ కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, రాష్ర్ట మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పక్కా భవనానికి కృషి..
మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలకు అనుమతి లభించడంతో మెడికల్ కళాశాలకు పక్కా భవన నిర్మాణం కొరకు స్థలాన్ని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ లు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పక్కా భవనం నిర్మాణం కొరకు త్వరితగతిన చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ లు దాయర లింగం, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, షమి, లక్ష్మినారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావ్, బొజ్జ పవన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్, పాపన్నపేట మండల నాయకులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, భరత్, మార్గం నాగరాజు, శంకర్, శ్రీనివాస్ చౌదరి, లక్కరు శ్రీనివాస్, పరుశురాం, సాదిక్, బాని, మహేశ్ గౌడ్, హపీజ్ మోల్సాబ్, మందుగుల గంగాదర్, పవన్ శ్రీకార్, లల్లూ, రాజా సింగ్, శ్రీకాంత్ రెడ్డి, అరుణ, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివదయాల్, ఎంఆర్ఓ లక్ష్మణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కృషి హర్షనీయం: జిల్లా కాంగ్రెస్ నాయకులు..
మెదక్ జిల్లాకు మంజూరు అయిన మెడికల్ కళాశాలకు అనుమతి కోసం తీవ్రంగా శ్రమించిన నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకోని అభినందనలు తెలుపుకున్నారు. బాణా సంచా కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు.