జీవన ఎరువుల వాడకంపై ప్రదర్శన

Demonstration on use of living fertilizers

Oct 17, 2024 - 19:02
 0
జీవన ఎరువుల వాడకంపై ప్రదర్శన
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ చేపడుతున్న జాతీయ సేవా పథకంలో భాగంగా రెండవ రోజున జీవన ఎరువుల వాడకంపై విధాన ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. వ్యవసాయంలో జీవనేరుల ప్రాముఖ్యత గురించి వివిధ పంటలలో ఏ విధంగా వాడుకోవాలి,  పర్యావరణానికి ప్రయోజనాలు, వాలంటీర్లకు, విద్యార్థులకు వివరించారు. 
 
రైతులు తుకూరి వేణుగోపాల్ రెడ్డి, చింతల సాయి, పుల్లంగారి హరి ప్రసాద్ పొలం వద్ద అజోస్ పెరిల్లో దాసరాన్ని కరిగించే బ్యాక్టీరియా (పిఎస్బి)  జీవన ఎరువుల గురించి విధాన ప్రదర్శన చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ నాయకులు, రైతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్, ఉపేందర్, డాక్టర్ సుమాలిని, డాక్టర్, శ్రీ రంజిత పాల్గొన్నారు.