కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు జే.శ్రీనివాస్
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు అన్ని గుర్తింపు కార్మిక సంఘాలు కృషి చేయాలని మందమర్రి హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు జే.శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఏరియా సీఎస్సీలో కార్మికులతో మాట్లాడారు. డిపెండెంట్ల ఉద్యోగుల వయోపరిమితి పెంపు అనేది గతంలోనే అన్ని గుర్తింపు సంఘాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాయని గుర్తుచేశారు. అదే విదంగా లాభాల వాటాను కార్మికులకు నెలలోపు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కొత్త గనులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, ఈ ప్రభుత్వం కొత్త గనులు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని యూనియన్ నాయకులను కోరారు. అలాగే కొన్నేళ్లుగా కార్మికులు మారుపేర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలకు పరిష్కరించాలని అధికారులను కోరారు.