మున్నూరు కాపులు ఐక్యతను చాటాలి

అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో కీలక నిర్ణయాలు

Sep 20, 2024 - 18:12
 0
మున్నూరు కాపులు ఐక్యతను చాటాలి
నా తెలంగాణ, ఆదిలాబాద్: మున్నూరు కాపు నియమావళి బైలాని అనుసరించి క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగుదామని, రాజకీయాలకతీతంగా మున్నూరుకాపులందరం ఐక్యతను చాటి చెప్పాలని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్  జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర, అపెక్స్​ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కౌన్సిల్  సభ్యుల సమావేశం అక్టోబర్ 26వతేదీన ములుగు (గజ్వేల్) మల్లక్కపేటలోని వీపీజే ఫంక్షన్ హాలులో నిర్వహించాలని నిర్ణయించారు.  
 
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథులుగా,  కౌన్సిల్ సభ్యులు వీరమళ్ల ప్రకాష్, సి.విఠల్, మీసాల చంద్రయ్య, ఎర్రా నాగేంద్రబాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.
సంఘం సంస్థాగత ఎన్నికలు వచ్చే ఏడాది (2025) మేలో నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలతో కూడిన పత్రాలను అపెక్స్​ కౌన్సిల్​ కు అందజేశారు. కౌన్సిల్ సభ్యులుగా నియామకం అయిన వారు అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని నిర్ణయించారు. 
 
26న నిర్వహించే కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు, ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా కౌన్సిల్​ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. 
 
ఈ సమావేశంలో అపెక్స్​ కౌన్సిల్​ కు సేవలందించిన గుంగుల కమలాకర్​ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా నియమితులైన వద్దిరాజు రవిచంద్రలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సన్మానించనున్నారు. 
 
ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం ప్రముఖులు బత్తుల సిద్ధేశ్వర్, ఆకుల గాంధీ, చల్లా హరిశంకర్, జుట్టు అశోక్, కూసం శ్రీనివాస్, కొత్తా లక్ష్మణ్, ఆవుల రామారావు, పుట్ట కిషోర్, గాజుల మహేందర్, వాసుదేవుల వెంకటేశ్వర్లు, బండి పద్మ, ఆర్వీ మహేందర్, వేల్పుల శ్రీనివాస్, ఉప్పు రవీందర్, పర్వతం సతీష్ తదితరులు పాల్గొన్నారు.