ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
Grand Gurupurnami celebrations
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: గురుపౌర్ణమి వేడుకలను పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే షిర్డీ సాయి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. దత్తాత్రేయుడు, సాయి బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శనాల కోసం క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురుపౌర్ణమికి ఓ ప్రత్యేక ఉందని గురువులకు కృతజ్ఞతలు తెలియజేసేదే గురుపౌర్ణమి పండుగని అన్నారు. షిర్డీ సాయి ఆలయం సాయి నామస్మరణతో మారుమోగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.