కేరళలో నిఫా డేంజర్​ బెల్స్​ బాలుడు మృతి

Nifa danger bells boy dies in Kerala

Jul 21, 2024 - 19:08
 0
కేరళలో నిఫా డేంజర్​ బెల్స్​ బాలుడు మృతి
  • కేంద్రం అలర్ట్​.. కేరళకు ప్రత్యేక వైద్య బృందాలు
  • ఐసోలేషన్​ లో 214మంది శాంపుల్స్​ సేకరణ
  • కేంద్రానికి నివేదిక
  • పూణె ఎన్​ ఐవీ నిఫా నిర్ధరణ

తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్​ తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ర్ట అభ్యర్థన మేరకు ఐసీఎంఆర్​ (ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసర్చ్​) టీమ్​ బీఎస్​ఎల్​–3ను పంపింది. ఈ బృందానికి చెందిన వైద్యాధికారులు కోజికోడ్​ ప్రయోగశాలకు ఆదివారం చేరుకున్నారు. బాలుడు మృతిచెందేందుకు పూర్తి కారణాల విశ్లేషణలో నిమగ్నమైంది. 

బీఎస్​ఎల్​–3 అప్రమత్తం..

కేంద్రం నుంచి ఐసీఎంఆర్​ ద్వారా పంపబడిన ఈ బృందం అలర్టయ్యింది. రాష్ర్ట ప్రభుత్వం ఐసోలేషన్​ లో ఉంచిన ప్రతీ ఒక్కరి శాంపూల్స్​ ను పరీక్షించనుంది. పాలిమరైజ్​ పరీక్షలను నిర్వహించనున్నారు. పీసీఆర్​ పరీక్షలను కూడా ఈ బృందం నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపడంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం, ఆరోగ్యశాఖకు చికిత్స విధానంలో మార్పు చేర్పులను వివరించనుంది.

14ఏళ్ల బాలుడు మృతి..

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన బాలుడికి అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉన్న పెరింతల్మన్నలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడి వైద్యులు కోజికోడ్​ లోని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ రోగిని పరిక్షీంచిన వైద్యులు బాలుడికి నిఫా వైరస్​ లక్షణాలు కనిపించడంతో పూణెలోని ల్యాబోరేటరికి పంపారు. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్​ ఐవీ) నిఫా సోకినట్లుగా నిర్ధరించింది. బాలుడు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.దీంతో కేరళ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే కేంద్రానికి సమాచారం అందించి ఉన్నత వైద్య బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఐసోలేషన్​ లో 214మంది..

దీంతో కేంద్ర వైద్య బృందాలు, పూణెలోని ఎన్​ ఐవీ వైద్యుల సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగాన్ని అలర్జ్​ చేశారు. బాలుడితో కాంటాక్ట్​ అయిన 214 మందిని ఐసోలేషన్​ కు తరలించి అబ్జర్వేషన్​ లో ఉంచారు. వీరందరి శాంపుల్స్​ ను సేకరించే పనిలో పడ్డారు. వైరస్​ ప్రబలిన కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కలెక్టర్​, ఎస్పీ చర్యలను పర్యవేక్షించాలని కేరళ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఎలా సోకుతుంది..

పూర్తిగా కుళ్లిపోయిన పళ్లను తినడం, గబ్బిలాల నుంచి మనిషికి నిఫా సోకే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. ఇదే గాక కుక్కలు, మేకలు గొర్రెలు, పిల్లలు, గుర్రాలు లాంటి జంతువుల వల్ల కూడా ఈ వైరస్​ సోకే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి వైద్య పరిభాషలో ‘జునోటిక్​’గా పేర్కొంటారు. 

లక్షణాలు..
నిఫా సోకిన వారిలో శ్వాస తీసుకోవడం, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలతో మెదడు తీవ్రంగా దెబ్బతిని నిమోనియా కూడా సోకే అవకాశం ఉంది. చివరకు రోగి ప్రాణాలను ఈ వైరస్​ హరిస్తుంది. 

నిఫాకు మందు లేదు!

నిఫా వైరస్​ కు ఇప్పటి వరకు ఎలాంటి మందులు కనుగొనలేదు. దీంతో ఈ రోగానికి మోనోక్లోనల్​ యాంటీ బాడీ చికిత్సా విధానాన్ని మాత్రమే అనుసరిస్తున్నారు. వీలైనంత మేరకు నిఫా వైరస్​ సోకిన వారిని ఐసోలేషన్​ చికిత్సనే ఉత్తమమైన విధానమని వైద్యులు గుర్తించారు.