ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నా తెలంగాణ, షాద్ నగర్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని నిరుపేద వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలతో పాటు చీరల పంపిణీ చేపడతుండటం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయ అధ్యక్షుడు విజయ్ కుమార్, లయన్ కమ్మదనం సుధాకర్, మాజీ కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మోహన్, శ్రీశైలం, సాయి వంశీ, భగవాన్ దాస్, సీతారాం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.