కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమానికి కృషి

ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఖాతా బుక్ ల పంపిణీ

Aug 1, 2024 - 16:41
 0
కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమానికి కృషి

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికులకు యాజమాన్యం భరోసా కల్పించే దిశగా కృషి చేస్తుందని మందమర్రి ఎస్ అండ్ పీసీ ఏఎస్ఓ రవికుమార్ అన్నారు. మందమరి డివిజన్ ఎస్ అండ్ పీసీ విభాగంలో  వీపీవీ, ఆర్బిఎస్ సంస్థల ద్వారా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు గురువారం హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ జీరో శాలరీ అకౌంట్ పాస్ బుక్ లను ఏఎస్ఓ రవికుమార్, సీనియర్ ఇన్స్పెక్టర్ రమేష్ లు అందజేశారు. హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ సిబ్బంది జీరో శాలరీ అకౌంట్లపై కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏఎస్ఓ రవికుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమంలో భాగంగానే జీరో శాలరీ అకౌంట్ పాస్ బుక్ లను వారికి అందజేస్తుందని వారి సంక్షేమా నికి సింగరేణి అధికారులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమిందార్ నారాయణ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.