నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ప్రముఖ కళాకారుడు మెట్టు రవిని శనివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఇలాంటి అవార్డులు మరిన్ని పొందుతూ జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి తెలంగాణ కళారత్న అవార్డుకి ఆదిలాబాద్ నుంచి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. జాతీయస్థాయి కళాకారుడిగా మిట్టు రవి రాణించాలని కోరారు. కళా రంగంలో జానపద, శాస్ర్తీయ నృత్యంలో సేవలందిస్తూ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్నవారిని అభినందించారు. రవి మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పి. శ్రీనివాస్, ధమ్మా పాల్, కొండ గణేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.