బొమ్మల్లో డ్రగ్స్​

స్వాధీనం అహ్మాదాబాద్​ క్రైమ్​ బ్రాంచ్​

Jun 22, 2024 - 20:30
Jun 22, 2024 - 20:31
 0
బొమ్మల్లో డ్రగ్స్​

అహ్మాదాబాద్​: బొమ్మల్లో దాచి పంపిన డ్రగ్స్​ ను అహ్మాదాబా ఎయిర్​ పోర్ట్​ లో క్రైమ్​ బ్రాంచ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్​ విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని తెలిపారు. 

ఆ డ్రగ్స్​ ను అమెరికా నుంచి పోస్టాఫీస్​ ద్వారా పంపినట్లు గుర్తించారు. ఆ పార్శిల్​ ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. పార్సిల్​ లో హైబ్రిడ్​ గంజాయి. లిక్విడ్​ రూపంలో ఉన్న డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకున్నారు. 58 పార్శిళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బొమ్మలతోపాటు చీరులు, పిల్లలకు వాడే డైపర్లు తదితరాలలో డ్రగ్స్​ ఉన్నట్లు గుర్తించారు. 

గతేడాది కూడా ఇదే పోస్టాఫీస్​ ద్వారా వచ్చిన వాటిలో భారీ మొత్తంలో డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిఘాను పెట్టారు. మరోమారు అక్కడి నుంచే డ్రగ్స్​ పెద్ద మొత్తంలో వస్తున్నట్లు క్రైమ్​ బ్రాంచ్​ కు సమాచారం అందింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అహ్మాదాబాద్​ లో ఈ పార్సిల్​ లు వెళ్లే చిరునామాలు పూర్తిగా తప్పుడు అని నిర్ధారించారు. అయితే ఈ పార్శిళ్లు ఎటు వెళ్లనున్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.