ఎస్సీ వర్గీకరణ తీర్పుపై హర్షం
Jubilation over SC classification verdict
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: ఎస్సీ వర్గీకరణకు తీర్పుపై బీజేపీ శ్రేణులు, ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేముల అశోక్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పోరాటం మరువలేనిదని మూడు దశాబ్దాల పోరాటానికి ఎస్సీ వర్గీకరణతో వెనుకబడిన ఎస్సీలకు న్యాయం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాన భూమిక పోషించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఎమ్మార్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ కౌన్సిలర్ గడ్డం సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మాసు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, సీనియర్ నాయకులు కుమ్మరి మల్లయ్య, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సంతోష్ రామ్ నాయక్, మోత్కూరు దేవేందర్, ఈదునూరి రంజిత్, కొండ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.