నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యాక్ట్ ఈస్ట్ పాలసీని మరింత పటిష్ఠం చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆగస్ట్ 5 నుంచి ఫీజీ, న్యూజిలాండ్, తైమూర్–లెస్టేలలో పర్యటించనున్నట్లు భారతవిదేశాంగ కార్యదర్శి జైదీప్ మజుందార్ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు.
5 నుంచి 7 వరకు ఫిజీలో పర్యటిస్తారని, ఈ సందర్భగా ఆ దేశాధ్యక్షుడు కబోనివేరే, ప్రధాని సితివేని రబుకాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారన్నారు. ఫిజీలోని భారతీయులతో సంభాషించనున్నారని తెలిపారు.
8 నుంచి 9 తేదీలలో న్యూజిలాండ్ పర్యటనలో గవర్నర్ సిండి కిరో, ప్రధాని క్రిస్టోఫర్ లతో సమావేశం అవుతారని తెలిపారు. వెల్లింగ్టన్ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. అనంతరం అక్లాండ్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
ఆగస్ట్ 10వ తేదీన తైమూర్–లెస్టేను సందర్శించి అధ్యక్షడు జోస్ రామోస్-హోర్టా, ప్రధానమంత్రి కే రాలాతో సమావేశమై ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన యాక్ట్ ఈస్ట్ పాలసీని మరింత పటిష్ఠం చేసేందుకు రాష్ట్రపతి ముర్మూ పర్యటన దోహదపడనుంది.