చెస్ లో భారత్ కు స్వర్ణం
Gold for India in chess
చైనా లిరెన్ ను ఓడించిన గుకేశ్
18వ ప్రపంచ చెస్ ఛాంపియన్
డ్రాగా ముగుస్తుందనుకున్న పోటీలో విజయం
సింగపూర్: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత్ మరోమారు సత్తా చాటింది. గురువారం చైనాతో జరిగిన పోటీలో భారత చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ సత్తా చాటాడు. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠగా పోరు కొనసాగింది. చివరికి గుకేష్ చైనాపై పై చేయి సాధించాడు. గుకేశ్ (18) తో చైనాకు చెందిన లిరెన్(32) పోటీ పడ్డాడు. ఈ పోటీ ఐదు గంటలపాటు సాగింది. డ్రాగా ముగిస్తుందనుకున్న పోటీలో చివరి 14వ రౌండ్ లో ఒక పాయింట్ తో గుకేశ్ విజేతగా నిలిచాడు. గుకేష్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలో నెపోమ్నియాషి, కరువానా, నకముర, లిరెన్ వంటి ప్రముఖులను చిత్తు చేశాడు. భారత్ కు చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణాన్ని అందించాడు. విశ్వనాథన్ ఆనంద్ తరువాత గుకేష్ 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. గుకేశ్ విజయం పట్ల పలువురు ప్రముఖులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.