జో బైడెన్ కుమారుడు దోషిగా నిర్ధరణ
అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ కేసులో డెలావేర్ కోర్టు తీర్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ డ్రగ్స్, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా తేలింది. డెలావేర్ లోని కోర్టు అతన్ని ఏడు రోజులు విచారించింది. మంగళవారం కేసు విచారణ అనంతరం దోషిగా నిర్ధరిస్తూ తీర్పు చెప్పింది. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుడి కుమారుడు దోషిగా తేలడం ఇదే మొదటి సారి కావడం విశేషం. దీంతో హంటర్ కు శిక్ష తప్పదని భావిస్తున్నారు. అతని శిక్షను మూడు నెలల్లోగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో గరిష్టంగా 25యేళ్లు, కనిష్టంగా 36 నెలల శిక్ష పడే అవకాశం ఉంది.
ఆరేళ్ల క్రితం హంటర్ బైడెన్ తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల విచారణలో ఇతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లుగా తేలింది. అంతకుముందే అతని వద్ద అక్రమ ఆయుధాలు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. దీంతో డెలావేర్ కోర్టులో ఈ కేసు కొనసాగింది. ఎట్టకేలకు మంగళవారం అతన్ని కోర్టు దోషిగా నిర్ధరించింది.
అమెరికా చట్టాల ప్రకారం డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వరు. ఈ కోణంలో విచారణ జరపగా హంటర్ ప్రియురాలు హేలీ డ్రగ్స్ అలవాటు, తుపాకులు కలిగి ఉన్నాడని కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో హంటర్ దోషిగా తేలాడు.