నేడే ప్రయాగ్ రాజ్ లో మోదీ పర్యటన
Modi's visit to Prayagraj Friday
రూ. 5,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన
లక్నో: ప్రయాగ్ రాజ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (డిసెంబర్ 13)న రూ. 5,500కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం గురువారం మోదీ పర్యటన వివరాలపై ప్రకటన విడుదల చేసింది. 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ని సందర్శించి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యాటక ప్రాంతాన్ని పెంపొందించే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు సంగం వద్ద పూజలో పాల్గొంటారు. 12.40కి అక్షయ వట వృక్షం వద్ద పూజ, హనుమాన్ దేవాలయం, సరస్వతి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మహాకుంభ్–2025 ఎగ్జిబిషన్ సైట్ ను వీక్షిస్తారు. 2 గంటలకు పది కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, శాశ్వత ఘాట్ లు, రివర్ ఫ్రంట్ రోడ్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మోదీ ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టులు మహాకుంభ్ కు పాల్గొనే భక్తులకు అసౌకర్యాలను పూర్తిగా తొలగించనుంది.