వ్యాపారవేత్తలకు రాజకీయాలు ఆపాదించొద్దు
సద్గురు జగ్గీ వాసుదేవ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వ్యాపారవేత్తలకు రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఇది సరికాదని ప్రముఖ సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. గురువారం వాసుదేవ్ సోషల్ మాధ్యమంగా పోస్టు విడుదల చేశారు. అదానీ అంశంపై విపక్షాలు పట్టు సరికాదన్నారు. భారత్ ప్రపంచంలో దీపస్తంభంలా ఉండాలనేదే తన కోరిక అన్నారు. భారత్ లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చే వారిపై రాజకీయ విమర్శలు తగవన్నారు. వ్యాపారంలో అవకతవకలు జరిగితే చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చన్నారు. భవ్యభారత్ నిర్మాణానికి వ్యాపారాలు వృద్ధి చెందడం కీలకమని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు.