సీఎం పేరు ప్రకటనలో మరింత జాప్యం
మహాకూటమి సమావేశం వాయిదా?
ఫడ్నవీస్ కే పదవి ఒప్పుకున్న ఇరుపార్టీలు
మంత్రి పదవుల పందెరంతోనే ఆలస్యం
1 లేదా 2 డిసెంబర్ న ప్రకటించే అవకాశం
మోదీ, షా అభిప్రాయాలను గౌరవిస్తామన్న షిండే, పవార్
ముంబాయి: మహాయుతి కూటమి సీఎం ఫడ్నవీస్ పేరు ఖరారైన ఇంకా ప్రకటించడంలో జాప్యం నెలకొంటుంది. గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు భేటీ అయ్యారు. సీఎం విషయంలో పట్టువిడిచినా పదవుల పంపకంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం భేటీ కూడా రద్దయ్యింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిపదవుల ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే శుక్రవారం రాత్రి ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీల పరంగా, మహాయుతి కూటమి పరంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 1 లేదా 2 డిసెంబర్ న ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫడ్నవీస్ సీఎంగా శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లు అంగీకరించినా ప్రకటన వెలువడకపోవడంతో మూడు పార్టీల నాయకుల్లో టెన్షన్ నెలకొంది. అయితే 132 స్థానాలతో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించంలో పలు కీలక శాఖలు కూడా తమ వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. అవే కీలక శాఖలను మిగతా రెండు పార్టీలు కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు తమ అభిప్రాయాలను గౌరవిస్తారని షిండే, పవార్ లు ప్రకటించారు.