పర్యాటక అభివృద్ధి.. ప్రధాని నిర్ణయం హర్షణీయం

తెలంగాణ రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి 

Nov 29, 2024 - 15:17
 0
పర్యాటక అభివృద్ధి.. ప్రధాని నిర్ణయం హర్షణీయం

23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులకు రూ. 3,295.76 కోట్ల నిధులు విడుదల
తెలంగాణ రామప్పకు రూ. 74 కోట్లు, సోమశిలకు రూ. 68 కోట్లు కేటాయింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటక రంగం అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రాజెక్టుల అభివృద్ధి ప్రాజెక్టుల రూ. 3,295.76 కోట్లకు ఆమోదం తెలిపినట్లు పీఎంవో కార్యాలయం వెల్లడించింది.

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి రూ. 74 కోట్లు, సోమశిలకు రూ. 68 కోట్లకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం 23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తుందనడానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ నిధులతో పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్​కారం, పర్యాటక ప్రాంతంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.

దీంతో తెలంగాణ, దేశ సంస్కృతి, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రపంచదేశాల్లో చాటిచెప్పే అవకాశం లభించడం సంతోషకరమని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి చెప్పారు. (స్పెషల్​ అసిస్టెంట్​ టు స్టేట్స్​ – యూనియన్​ టెర్రటోరియస్​ ఫర్​ క్యాపిటల్​ ఇన్వెస్టిమెంట్​–ఎస్​ఎఎస్​ సీఐ)–రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక సహాయం పథకం కింద 50 యేళ్లపాటు పలు పర్యాటక ప్రాంతాలకు వడ్డీలేని రుణాలను అందిస్తుందన్నారు. తద్వారా, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుందని, సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధిలో పెరుగుదల నమోదవుతుందని మంత్రి తెలిపారు. భారత, తెలంగాణ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.