తీహార్​ జైలుకు సీఎం కేజ్రీవాల్​ 

CM Kejriwal to Tihar Jail

Jun 2, 2024 - 16:45
 0
తీహార్​ జైలుకు సీఎం కేజ్రీవాల్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ఆదివారం తీహార్​ జైలులో లొంగిపోయారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సీఎం కేజ్రీవాల్​ తొలుత ఢిల్లీలోని రాజ్​ ఘాట్​ ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కన్నాట్​ ప్లేస్​ లోని హనుమాన్​ దేవాలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని ఆప్​ నాయకులు, కార్యకర్తలకు సందేశాన్నిచ్చారు. అవినీతికి పాల్పడ్డరన్న ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నాయకులు,  కార్యకర్తలు ధీమా ఉండాలన్నారు. తనకు న్యాయం, ధర్మం, చట్టంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. త్వరలోనే నిర్ధోషిగా బయటపడతానన్నారు. అప్పటివరకు పార్టీ శ్రేయోభిషులంతా పార్టీ విధి విధానాలకు కట్టుబడి నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అక్కడి నుంచి తీహార్​ జైలుకు వెళ్లి గేట్​ నంబర్​ 1 వద్ద ఉన్న భద్రతా సిబ్బందితో కలిసి జైలులోకి వెళ్లారు. మద్యం ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్​ జ్యూడీషియల్​ కస్టడీలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్​ కు 21 రోజుల మధ్యంతర బెయిల్​ ను ఇచ్చింది. అనారోగ్యం కారణంగా మరో ఏడు రోజులపాటు బెయిల్​ ను పొడిగించాలన్న విజ్ఞప్తిపై కోర్టు వెంటనే విచారణకు నో చెప్పిన విషయం తెలిసిందే.