రోడ్డు ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Four soldiers died in a road accident
కోల్ కతా: రోడ్డు ప్రమాదంలో నలుగురు సైనికులు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ లోని పాక్యోంగ్ జిల్లా పెడాంగ్ నుంచి జులుక్ వెళుతుండగా సిల్క్ రహదారిపై ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. మృతి చెందిన సైనికుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన డ్రైవర్ ప్రదీప్ పటేల్, మణిపూర్‌కు చెందిన క్రాఫ్ట్‌మ్యాన్ డబ్ల్యూ పీటర్, హరియాణాకు చెందిన నాయక్ గుర్సేవ్ సింగ్, తమిళనాడుకు చెందిన సుబేదార్ కె. తంగపాండి ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ బినాగురి యూనిట్ ఆర్మీ అధికారి తెలిపారు.