సమాజ నిర్మాణానికి గురువులు మూలం

ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, కలెక్టర్​ రాహుల్​ రాజ్​

Sep 5, 2024 - 16:47
 0
సమాజ నిర్మాణానికి గురువులు మూలం
నా తెలంగాణ, మెదక్​: సమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి మెదక్​ కలెక్టరేట్​ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, కలెక్టర్​ రాహుల్​ రాజ్​ పాల్గొని ప్రసంగించారు. 
 
సర్వేపల్లి జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. గురువులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉందన్నారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులు కాంతిని చూపే దీపాలన్నారు. పాఠాలతోపాటు మంచి విలువలు, ఆలోచనలు, విజయ మార్గాలకు విద్యార్థులు చేరుకునేలా తీవ్రమైన కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మెదక్​ జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమోంటో, శాలువాతో సన్మానించారు. 
 
ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాధికారి రాధా కిషన్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మండల విద్యాధిరులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.