15–16పాక్ పర్యటనకు మంత్రి జై శంకర్!
Minister Jai Shankar to visit Pakistan on 15-16!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అక్టోబర్ 15–16 తేదీల్లో పాక్ లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్ లో జరిగే ఎస్ సీవో (కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ) సమావేశానికి హాజరుకానున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ వెల్లడించారు. పాక్ లో భారత్ మంత్రి పర్యటించడం తొమ్మిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి కానుందన్నారు.
2015లో చివరిసారిగా లాహోర్ లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటించి ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారు. 2019 జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించిన తరువాత ఇరుదేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లయ్యాయి. ఆ తరువాత పాక్ తో చర్చల్లేవ్ అని బహిరంగంగానే భారత్ ప్రకటించింది.