రూ.44,605 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Foundation laying of Rs.44,605 crore development works
నేడే మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో ప్రధాని నరేంద్ర మోదీరూ. 44,605 కోట్లతో డిసెంబర్ 25 (బుధవారం) కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్ లోని10 జిల్లాల్లోని దాదాపు 44 లక్షల మందికి, యూపీలోని 21 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్లు సౌరశక్తి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండువేల గ్రామాలకు 7.18 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.