సరిహద్దు వద్ద చొరబాటుదారుడి ఎన్ కౌంటర్
Encounter of an intruder at the border
జైపూర్: రాజస్థాన్ సరిహద్దు శ్రీ గంగానగర్ లో ఓ చొరబాటుదారుడిని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. పలుమార్లు అతన్ని హెచ్చరించినప్పటికీ సరిహద్దును దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని ఆర్మీ అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. చొరబాటు జరుగుతుందని పక్కా సమాచారం మేరకు అక్కడ నిఘాను ముమ్మరం చేశారు. ఎన్ కౌంటర్ అయిన మృతుని వద్ద పాక్ కు చెందిన కరెన్సీ, సిగరెట్ ప్యాకెట్లు, మరికొన్ని వస్తువులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. చొరబాటుదారుడిని సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడి ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలకు కీలక ఆధారాలు లభించాయి. హిజ్బుల్ ఏకంగా కార్పొరేట్ సంస్థ తరహాలో ఉగ్రవాదులకు ఐడీ కార్డులను కూడా రూపొందించినట్లు గుర్తించారు.