ఆఫ్ఘాన్​ లో పాక్​ దాడి.. 46 మంది మృతి

ప్రతీకారం తప్పదని తాలిబాన్​ హెచ్చరిక

Dec 25, 2024 - 18:52
 0
ఆఫ్ఘాన్​ లో పాక్​ దాడి.. 46 మంది మృతి

కాబూల్​: ఆఫ్ఘానిస్థాన్​ లో పాక్​ చేసిన వైమానిక దాడిలో 46 మంది మృతిచెందారని దాడులకు ప్రతీకారం తప్పదని తాలిబాన్​ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్​ అన్నారు. పాక్​ మంగళవారం అర్థరాత్రి జరిపిన వైమానిక దాడులపై బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తూర్పు పాక్టికా ప్రావిన్స్​ లో నాలుగు గ్రామాలపై ఈ దాడులు జరిగాయన్నారు. దాడుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా మృతి చెందారని తెలిపారు. తాలిబాన్​ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా మాట్లాడుతూ ఈ చర్యను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దాడుల్లో మృతి చెందారన్నారు. చాలామందికి గాయాలయ్యాయని వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందజేస్తున్నట్లు తెలిపారు. పాక్​ దాడిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. 

ఇటీవలే ఖైబర్​ ఫంక్తూవ్వా లో తాలిబాన్​ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 16 మంది పాక్​ ఆర్మీ సైనికులు మృతిచెందారు. 8మందికి గాయాలయ్యాయి. ఈ దాడికి ప్రతీచర్యగా పాక్​ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. పాక్​ దాడులతో ఈ రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.