పిలిభిత్ ఎన్ కౌంటర్ రంగంలోకి ఎన్ ఐఎ
NIA enters Pilibhit encounter field
లక్నో: పిలిభిత్ ఎన్ కౌంటర్ పై ఎన్ ఐఎ (నేషనల్ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) విచారణ ప్రారంభించింది. బుధవారం పిలిభిత్ లోని ముగ్గురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఆయుధాల ద్వారా ఆధారాలనుసేకరించే పనిలో పడింది. సెల్ ఫోన్ల నుంచి నిందితులు ఎవరెవరితో మాట్లాడారు. అసలు అత్యాధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు అందించారన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది. ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపనున్నారు. మొబైల్ ఫోన్లు, ఏకే 47లు, రెండు పిస్టల్లు, క్యాట్రిడ్జ్ లు ల్యాబ్ కు పంపించనున్నారు. ఎన్ ఐఎ నిందితుల డేటాను విశ్లేషించి పాత రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. పురాన్ పూర్లో బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది.