స్థిరమైన వృద్ధికి వాజ్ పేయి పునాది
Vajpayee is the foundation for sustainable growth
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వందవ జయంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్ద నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో సుధీర్ఘమైన, స్థిరమైన వృద్ధికి అటల్ బిహారీ వాజ్ పేయి పునాది వేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వాజ్ పేయి వందవ జయంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని సదైవ్ అటల్ సమాధి వద్ద ప్రధానితోపాటు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మాజీ రాష్ర్టపతి రామ్ కోవింద్, స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వాజ్ పేయి వ్యక్తిత్వంలో అనేక కోణాలున్నాయన్నారు. వక్త, రచయిత, కవి, నిస్వార్థ సామాజిక సేవకుడన్నారు. అన్నింటికంటే ప్రముఖంగా దేశం, ప్రజల కోసం ఎప్పుడూ ఏదైనా చేయాలనే తపనే ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఆయన ముందుచూపు ఆర్థిక విధానాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేశాయన్నారు. పోఖ్రాన్ లో అణు పరీక్షలను విజయవంతం చేయగలిగారన్నారు. నాలుగు దశాబ్దాలు సుధీర్ఘ పార్లమెంటరీ అనుభవం ఉన్న ఉత్తమ పార్లమెంటరీ నాయకుడు వాజ్ పేయి అన్నారు.
ఐక్యరాజ్యసమితిలోనూ తొలిసారిగా దేశభాషలో మాట్లాడి దేశ క్తీతిని నలు దిశలా వ్యాపింప చేశారని కొనియాడారు. అటల్ ను భారతరత్నతో సత్కరించుకోవడం హర్షణీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.