నందిగ్రామ్​ లో బీజేపీ మహిళా కార్యకర్త హత్య

ఓటమిభయంతో దాడులకు టీఎంసీ దాడులు బీజేపీ ఆందోళన, నిరసన ప్రదర్శనలు

May 23, 2024 - 13:44
 0
నందిగ్రామ్​ లో బీజేపీ మహిళా కార్యకర్త హత్య

కోల్​ కతా: నందిగ్రామ్​ లో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఓ మహిళా కార్యకర్త మృతిచెందగా మరో ఏడుగురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి నుంచి దాడులకు టీఎంసీ కార్యకర్తలు తెగబడుతున్నారు. గురువారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. దాడుల్లో పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. టీఎంసీ దాడులను నిరసిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శనలు చేపట్టింది. మే 25న ఈ ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించే ఓటమి పాలవుతామనే ఆందోళనలో దాడులు టీఎంసీ దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ ఆరోపించింది. 

మరోవైపు ఓబీసీ రిజర్వేషన్లను బుధవారం హైకోర్టు రద్దు చేసింది. దీంతో దీన్ని ఒప్పుకునేది లేదని సీఎం మమతా బెనర్జీ బహిరంగంగానే ప్రకటించారు. ఈ తీర్పు కూడా అగ్నికి ఆజ్యం పోసిందని గొడవలకు దారితీసి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
కాగా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడుల ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది.