పార్లమెంట్​ వద్ద నిప్పంటించుకున్న వ్యక్తి

కుటుంబ కలహాలే కారణమన్న పోలీసులు

Dec 25, 2024 - 19:04
 0
పార్లమెంట్​ వద్ద నిప్పంటించుకున్న వ్యక్తి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్​ హౌస్​ వెలుపల యూపీకి చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో నిప్పంటించుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. యూపీకి బాగ్​ పత్​ కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి ఉదయం రైలులో ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తనవెంట పెట్రోల్​ బాటిల్​ తెచ్చుకొని పార్లమెంట్​ బయట ఒక్కసారిగా నిప్పంటించుకున్నాడని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని రామ్​ మనోహన్​ లోహియా ఆసుపత్రికి తరలించామన్నారు. అతనికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. జితేంద్ర నిప్పంటించుకునేందుకు కుటుంబ కలహాలతోపాటు ఇరుగుపొరుగు వారితో శత్రుత్వం కూడా కారణమని తెలుస్తోందన్నారు.