ముగిసిన వర్షాకాలం

9 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​

Oct 1, 2024 - 18:10
 0
ముగిసిన వర్షాకాలం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వర్షాకాలం–2024 ముగిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 9 రాష్ర్టాల్లో ఋతుపవనాల ప్రభావం బుధవారం ఉంటుందని మంగళవారం ప్రకటించింది. రాజస్థాన్​, గుజరాత్​, పశ్చిమ మధ్యప్రదేశ్​, మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ లలో ఆశించిన స్థాయి కంటే వర్షాలు ఎక్కువగానే నమోదయ్యాయని తెలిపారు. 7.6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. 

బుధవారం అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ  హెచ్చరించింది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.