బీజేపీలోకి హస్తం నేత గౌరవ్
ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం తిరస్కరణ వ్యాపారవేత్తలకు బెదిరింపులు నచ్చకనే రాజీనామా సమర్పణ మల్లిఖార్జున ఖర్గేకు లేఖలో వివరణ
న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్‌నాయకుడు గౌరవ్ వల్లబ్ఆపార్టీకి రాజీనామా సమర్పించి బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నాయకుడు వినోద్ తావ్డే ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి స్వాగతం పలికారు. వల్లబ్‌తోపాటు ఆయనతో పాటు బిహార్ కాంగ్రెస్ నేత అనిల్ శర్మ, ఆర్జేడీ నేత ఉపేంద్ర ప్రసాద్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గౌరవ్ మాట్లాడుతూ.. పార్టీ రాజీనామా ఎందుకు చేస్తున్నానో తాను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్పష్టంగా లేఖ రాశానని తెలిపారు. హిందూ సమాజానికి అంత్యత ప్రియమైన భగవంతుడు శ్రీరాముడన్నారు. అలాంటి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్‌పార్టీకి ఆహ్వానం అందిస్తే అది తిరస్కరించడం తనకు నచ్చలేదని ఇదే విషయాన్ని గతంలో కూడా పలుమార్లు సూటిగానే పార్టీ నేతల వద్ద చెప్పినా తనను పెద్దగా పట్టించుకోలేదన్నారు. అంతేగాక దేశంలోని ఆర్థిక వేత్తలను కూడా బెదిరించడం ఏం బాగోలేదన్నారు. తానను ఎకనామిక్ విద్యార్థినన్నారు. వ్యాపార వృద్ధితోనే దేశ ప్రగతి చక్రం ముందుకు సాగుతుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. రాజకీయ పరంగా ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా పరవాలేదుగానీ వ్యాపారవేత్తలను బెదిరించడం, ఆరోపించడం, భయపెట్టడం లాంటివి చేస్తే అది దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడినట్లేనని తాను భావిస్తున్నానని గౌరవ తెలిపారు. ఈ విధానాలు నచ్చకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. వల్లబ్2023లో ఉదయ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. కాగా స్థానికంగా మంచి పట్టున్న నాయకుడిగా గౌరవ్ వల్లబ్కు పేరుంది.