ఎల్పీజీ ట్యాంకర్​ పేలి ఏడుగురు మృతి

Seven killed in LPG tanker explosion

Dec 20, 2024 - 13:38
Dec 20, 2024 - 18:34
 0
ఎల్పీజీ ట్యాంకర్​ పేలి ఏడుగురు మృతి

42మందికి తీవ్ర గాయాలు
కాలిబూడిదైన 40 వాహనాలు

జైపూర్​: రాజస్థాన్​ జైపూర్​ లోని అజ్మీర్​ హైవేపై ఎల్పీజీ ట్యాంకర్​ పేలి 11 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి తీవ్ర గాయాలు కాగా 14 మంది ఆచూకీ లభించలేదు. 200మీటర్ల ప్రాంతంలో ఉన్న వాహనాలన్నీ కాలిబూడిదయ్యాయి. ట్యాంకర్​ పేలడంతో 10కి.మీ. మేర భారీ శబ్ధాలు వచ్చాయి. ట్యాంకర్​ లో ఉన్న 18 టన్నుల గ్యాస్​ నిక్షేపాలు ఒక్కసారిగా భగ్గు మనడంతో స్థానికంగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదం సంభవించిన వందమీటర్ల దూరంలోనే అండర్​ గ్రౌండ్​ లో గ్యాస్​ పైప్​ లైన్​ ఉంది. ఆ పైప్​ లైన్​ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

శుక్రవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజ్మీర్​ నుంచి జైపూర్​ కు వస్తున్న ఎల్పీజీ గ్యాస్​ ట్యాంకర్ భంక్రోటాలో​ యూటర్న్​ తీసుకుంటుండగా ట్రక్కు ఢీకొంది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కాసారిగా మంటలు చెలరేగాయి. ట్రక్కు, ట్యాంకర్ల వెనుక వస్తున్న వాహనాలన్నీ కాలిబూడిదయ్యాయి. స్థానికంగా గ్యాస్​ వ్యాపించడంలో రెస్క్యూ బృందాలకు సహాయక చర్యల్లో ఆటంకాలు తలెత్తాయి. 22 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పారు. ఐదు అంబులెన్సుల ద్వారా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ప్రమాదంపై భంక్రోటా పోలీస్​ స్టేషన్​ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

రాజస్థాన్​ పేలుడుపై సీఎం భజన్​ లాల్​ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రమాదంపై రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ,  ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. కేంద్రం తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.