తొలిసారిగా అయోధ్యకు అధ్యక్షురాలు
బాలరాముని సందర్శన భారీ బందోబస్తు
లక్నో: అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము అయోధ్య చేరుకొని బాలరామున్ని దర్శించుకున్నారు. బుధవారం ఆమె అయోధ్య చేరుకొని పలు మందిరాలను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ర్టపతి తొలిసారి పర్యటన సందర్భంగా మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమెకు స్వాగతం పలికారు. హనుమాన్‌గర్హిని సందర్శించిన అనంతరం రాష్ర్టపతి సరయూ అతిథి గృహానికి వెళ్లారు. ఇక్కడ అల్పాహారం చేసిన తర్వాత, రాష్ట్రపతి సాయంత్రం 5.30 గంటలకు సరయూ ఒడ్డుకు చేరుకొని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలోని బాలరామున్ని దర్శించుకున్నారు. అధ్యక్షురాలు పలు మందిరాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నందున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆమె పర్యటిస్తున్న అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆయా మందిరాల్లో ప్రోటోకాల్ ప్రకారం రాష్ర్టపతికి ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు.
కాగా అధ్యక్షురాలు విందు చేశాక తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ విందుకు గవర్నర్ తో సహా 20 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.