పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

సంబంధం లేదన్న కాంగ్రెస్​

May 8, 2024 - 15:54
 0
పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేత జాతీయుల్లా, దక్షిణాది వాళ్లు ఆఫ్​రికన్లలా కనిపిస్తారని బుధవారం కాంగ్రెస్​ పార్టీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ నాయకుడు శ్యామ్​ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రజాస్వామ్యానికి భారతదేశం ఉత్తమ నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మనలో ఉండి పరస్పరం గౌరవించుకుంటామని పిట్రోడా పేర్కొన్నారు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండడంతో కాంగ్రెస్​ పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ సీనియర్​ నాయకుడు జై రాం రమేశ్​ మాట్లాడుతూ.. పిట్రోడా వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అవి ఆయన వ్యక్తిగతమన్నారు.