శ్రీనగర్ లో 70వ దశకం బాలీవుడ్ నటీమణులు
70s Bollywood actresses in Srinagar
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో పర్యాటకం పెంచుతామని దీని ద్వారా ఇక్కడి ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ పదే పదే చెప్పడం తెలిసిందే. స్థానికుల వ్యాపారాల్లో వృద్ధి, ఉపాధి లభిస్తాయని తద్వారా ప్రపంచంలోనే జమ్మూకశ్మీర్ ను ప్రత్యేకంగా రూపుదిద్దుతామని మోదీ అనేకమార్లు తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. క్రమేణా జమ్మూకశ్మీర్ పర్యటనకు చాలామందే ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి 1970 నాటి దశకం నటీమణులు జమ్మూలో సేద దీరుతున్న చిత్రాలను తమ సోషల్ ఖాతాలపై ఆదివారం పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లోని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. వహీదా రెహ్మాన్, హెలెన్, ఆశా పరేఖ్ లు శ్రీనగర్ లో ఎంజయ్ చేస్తున్నట్లు తమ ఇన్ స్టాలో వివరాలను పంచుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ సీనితారలు బాలీవుడ్ లో మంచి మంచి చిత్రాల్లో నటించారు. లంచ్, హౌస్ బోట్ లలో ప్రయాణం తదితర చిత్రాలను వీరు విడుదల చేశారు.