ప్రాణాలు తీస్తున్న అతివేగం
గంటకు 53 ప్రమాదాలు 19 మరణాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ప్రతీగంటకు 53 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఓ నివేదికలో పేర్కొంది. ఇటీవల పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా 2022కు సంబంధించి కేంద్రం ప్రకటించిన రోడ్డు ప్రమాదాల నివేదికను చూస్తే పలు ఆశ్చర్యం గొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 2022లో 1,10,027 ప్రమాదాలు చోటు చేసుకోగా 45,928 మంది మృతిచెందారు. 3268 మంది డ్రంకన్ డ్రైవింగ్, 2478 మంది ఫోన్ మాట్లాడుతుండగా, 7330 మంది రాంగ్ సైడ్ లో డ్రైవింగ్, 2479 మంది ర్యాష్ డ్రైవింగ్, 707 మంది రెడ్ లైట్ ను పట్టించుకోకపోవడం వల్ల మృతిచెందారు.
దేశంలో ఎక్కువ ప్రమాదాలకు కారణం అతివేగమే. సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, పరధ్యానం లాంటి కారణాలను గుర్తించింది.