వరద నిర్వహణకు రూ. 2514.36 కోట్లు మంజూరు
హోంమంత్రి నేతృత్వంలో కమిటీ ఆమోదం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల వరద నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2514.36 కోట్లను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని 6 మెట్రోపాలిటన్ నగరాల్లో పట్టణ వరద నిర్వహణ కోసం ఈ నిధులను విడుదల చేసింది.
ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ లు పాల్గొన్నారు.
ఎన్డీఎంఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ జాతయ విపత్తు, ఉపశమన నిధుల కింద 9 ప్రతిపాదనలపై చర్చించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్ డీఆర్ఎఫ్ కింద 14 రాష్ట్రాలకు రూ.6348 కోట్లు, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (ఎస్‌డిఎంఎఫ్) కింద 6 రాష్ట్రాలకు రూ.672 కోట్లు విడుదల చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కాకుండా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద 10 రాష్ట్రాలకు రూ.4265 కోట్లు విడుదల చేసింది.