293కు పెరిగిన మృతుల సంఖ్య

  130మందికి చికిత్స, 240 మంది గల్లంతు

Aug 1, 2024 - 22:49
 0
293కు పెరిగిన మృతుల సంఖ్య

వయోనాడ్​: కేరళలోని వయోనాడ్​ లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో గురువారం రాత్రి వరకు మృతి చెందిన వారి సంఖ్య 293కు చేరినట్లు అధికారులు తెలిపారు. 130మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 240 గల్లంతయ్యారని పేర్కొన్నారు. మరోవైపు రెస్క్యూ చర్యలను నిలిపివేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. 

మృతదేహాలను కనుగొనే పనుల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆర్మీ కమాండ్​ తెలిపారు. ఎవరైనా చిక్కుకొని ఉంటే వారిని రక్షిస్తామన్నారు. 

రాత్రివేళలో ప్రతికూల వాతావరణం ఉంటుండంతో ఆపరేషన్​ ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సాయం మాత్రం కొనసాగిస్తాన్నారు.