చరైడియో మోయిదమ్ కు యూనెస్కో గుర్తింపు
43వ వారసత్వ కట్టడంగా అసోం పిరమిడ్ ఫలించిన ప్రధాని మోదీ కల భారత మండపంలో యూనెస్కో అధికారుల ప్రకటన సంతోషం వ్యక్తం చేస్తున్న అసోం వాసులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒక్కొక్కటిగా ప్రధాని నరేంద్ర మోదీ భారతయుల కలలను నెరవేర్చడంలో సఫలీకృతమవుతున్నారు. అసోంలోని చరైడియో మోయిదమ్ చారిత్రక దిబ్బకు యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. శుక్రవారం న్యూ ఢిల్లీలోని భారత మండపంలో యూనెస్కో అధికారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించి ఆమోదం తెలిపారు. దీంతో మోయిదమ్ కు 43వ ప్రపంచవారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యూనెస్కో ప్రకటించింది.
మోయిదమ్ భారత తొలి సాంస్కృత్రిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా దేశంలోని పలు ప్రాంతాలను వారసత్వ కట్టడాలుగా గుర్తించాలని యూనెస్కోకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో కూడా ప్రధాని మోదీ మోయిదమ్ గురించి ప్రసంగించారు.
దీంతో ఈశాన్య ప్రాంతాల్లోని యూనెస్కో జాబితాలో చేరిన మూడో వారసత్వ కట్టడంగా ఇది గుర్తింపు పొందింది. కాజిరంగ, మానస్ లు ఇదివరకూ యూనెస్కో గుర్తింపు లభించాయి.
46వ యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ను భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
చరైడియో మోయిదమ్..
చరైడియో మోయిదమ్ అనేది అసోంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన సభ్యుల మృత దేహాలను పాతిపెట్టే ప్రక్రియ. రాజులను వారి వారి వస్తువులతోపాటు ఈ సమాధిలో పాతి పెట్టేవారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన ఈ సమాధులను 13 నుంచి 18వ శతాబ్దాలలో అహోం రాజులు నిర్మించారు. వీటిని అసోం పిరమిడ్ లు అని కూడా అంటారు. ఇవి గడ్డి పుట్టల వలె కనిపిస్తాయి. ఈ సమాధులపై నిండా పచ్చదనంతో కూడుకున్న గడ్డి పరుచుకొని ఉంటుంది. వీటిని అసోం వాసులు అతిపవిత్రమైనవిగా భావిస్తూ పూజిస్తారు.
యూనెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో పలువురు ప్రధాని మోదీ కృషికి, యూనెస్కో అధికారులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.