చిన్నపిల్లలున్న మహిళా ఉద్యోగుల కోసం క్రెచ్​ సెంటర్లు!

తొలి విడతగా 6వేల సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం రాబోయే కాలంలో లక్షకు పెంచనున్న ప్రభుత్వం ఉన్నతాధికారులతో మహిళా మంత్రిత్వ శాఖ సమావేశం

Jul 26, 2024 - 15:17
 0
చిన్నపిల్లలున్న మహిళా ఉద్యోగుల కోసం క్రెచ్​ సెంటర్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉద్యోగం చేస్తున్న మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆరువేల అంగన్​ వాడీ కేంద్రాల్లో క్రెచ్​ సెంటర్లను ప్రారంభించనుంది. శుక్రవారం ఈ దిశగా మహిళా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. క్రెచ్​ సెంటర్ల ఏర్పాటుపై చర్చించింది. తొలివిడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తమ చిన్న పిల్లలను ఈ క్రెచ్​ సెంటర్లలో వదిలి వెళ్లే సౌలభ్యాన్ని కల్పించనుంది. దీంతో చిన్నపిల్లలున్నారని ఉద్యోగాలు చేసుకోలేకపోతున్న అనేకమంది గ్రామీణ ప్రాంత మహిళలకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం లక్ష క్రెచ్​ సెంటర్లను ఏర్పాటు చేయాలని తలచింది. తొలి విడతగా ఆరువేల సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 

క్రెచ్​ సెంటర్లలో పనిచేసేందుకు సిబ్బంది నియామకం, అవసరాలు, స్థలాలు, బడ్జెట్​, ఆహారం, ఆటబొమ్మలు తదితర సౌకర్యాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది.