హమాస్​ చీఫ్​ ఫతా షరీఫ్​ మృతి

ప్రకటించిన ఐడీఎఫ్​

Sep 30, 2024 - 17:41
 0
హమాస్​ చీఫ్​ ఫతా షరీఫ్​ మృతి

జేరూసలెం: లెబనాన్​ లో ఇజ్రాయెల్​ దాడి కొనసాగుతోంది. లెబనాన్ హమాస్​​ చీఫ్​ ఫతా షరీఫ్​ ను హతమార్చినట్లు ఐడీఎఫ్​ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. హిజ్బొల్లా చీఫ్​ నస్రుల్లా మరణం తరువాత లెబనాన్​ లో హమాస్​–హిజ్బొల్లా ఉగ్రకార్యకలాపాలను వేగవంతం చేసందుకు షరీఫ్​ బాధ్యతలు చేపట్టాడు. ఆయుధాలను అందించడంలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. షరీఫ్​ గుర్తింపు పొందిన యునైటెడ్​ నేషన్స్​ రిలీఫ్​ అండ్​ వర్క్స్​ ఏజెన్సీలో సభ్యుడు, లెబనానల్​ యూనైటెడ్​ నేషన్స్​ రిలీఫ్​ అండ్​ వర్క్స్​ ఏజెన్సీ టీచర్స్​ అసోసియేషన్​ అధిపతి అని ఐడీఎఫ్​ పేర్కొంది. ఇజ్రాయెల్​ పౌరులకు ముప్పు కలిగించే ఎవ్వరిని వదలబోమని ఐడీఎఫ్​ మరోమారు ప్రకటించింది.