అక్టోబర్ 2న జేఎస్ పీ ఎన్నికల ప్రకటన?
JSP election announcement on October 2?
మీడియాతో జేఎస్పీ అధినేత ప్రశాంత్ కిషోర్
సమగ్రాభివృద్ధికి బ్లూప్రింట్ విడుదల
మద్య నిషేధం ఎత్తివేత?
పాట్నా: జనసూరజ్ పార్టీ అధినేత, రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ సోమవారం మీడియాకు పలు వివరాలను అందించాయి. బిహార్ సమగ్రాభివృద్ధికి బ్లూ ప్రింట్ తీసుకురానున్నామన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 8500 గ్రామ పంచాయతీల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు వివరించారు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెండున్నరేళ్లలో 60 శాతం గ్రామాల్లో తిరిగామన్నారు. తమ లక్ష్యం ప్రతీ గ్రామానికి చేరుకునే వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో సమస్యల జాబితాను రూపొందిస్తూ, వాటి పరిష్కార మార్గాలను కూడా అందజేస్తామన్నారు.
ఎన్నికల్లో పోటీ అంశాన్నే ప్రకటిస్తారా? ఇంకా ఏమైనా వివరాలు అందజేస్తారా? అనే విషయంపై ఆయన స్పష్టతనీయలేదు. బిహార్ లో మద్య నిషేధంపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా సమకూరిన ధనాన్ని పిల్లల మెరుగైన చదువుల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం నిషేధం ఎత్తివేస్తే మహిళల ఓట్లు రాలకపోవచ్చని పార్టీ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో దీనిపై పూర్తిగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
అదే సమయంలో ఎన్నికల్లో జన సూరజ్ పార్టీ టిక్కెట్లు ఇచ్చే సమయంలో అభ్యర్థులతో అంగీకార పత్రం తీసుకుంటామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.