హస్తంకు ఝలక్ హస్తిన కాంగ్రెస్ చీఫ్ లవ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా!
Chief Lovely resigns from the presidency! Congress in trouble
న్యూఢిల్లీ: హస్తం పార్టీకి ఝలక్ మీద ఝలక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని పదవికి కాదని ఆయన అన్నారు. ఆదివారం ఈ సమాచారాన్ని లవ్లీ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రూపంలో పంపారు.
ఇదే విషయాన్ని సాయంత్రం ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించారు. తాను పంపిన లేఖలో అన్ని విషయాలు రాశానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్ తో పొత్తుకు తాను వ్యతిరేకమని పలుమార్లు తెలిపానన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఆప్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వ్యతిరేకత వస్తుందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టాన పెద్దలకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని లవ్లీ పేర్కొన్నారు. అంతేగాక ఢిల్లీలో కేవలం మూడు స్థానాలు మాత్రమే తీసుకున్నారని, అందులోనూ రెండు స్థానాల్లో బయటివారికి అవకాశం కల్పించడంపై ఆయన మండపడ్డారు. ఢిల్లీలో పార్టీ పటిష్టతకు కారణమైన తమకు బయటివారికి సీట్లు కేటాయించే ముందు ఒక్కమాట కూడా చెప్పకపోవడంపై ఆయన కినుకు వహించారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల పలు పార్టీ కార్యక్రమాల్లో బయటివారికి టిక్కెట్టు కేటాయిస్తామనడంతో ఆయన విభేదించారు కూడా. అయినా అధిష్టాన పెద్దలు లవ్లీ వాదనను పంటించుకోలేదు.