పంజాబ్​ లో రోడ్డు ప్రమాదం 10 మంది మృతి?

20మందికి తీవ్ర గాయాలు సీఎం విచారం, సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశం

Sep 30, 2024 - 17:58
 0
పంజాబ్​ లో రోడ్డు ప్రమాదం 10 మంది మృతి?

చండీగఢ్​: పంజాబ్​ గురుదాస్​ పూర్​ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం గురుదాస్​ పూర్​ బటాలా నుంచి కడియా రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. బస్సు బటాలా నుంచి మొహాలి వైపు వెళుతుండగా షహాబాద్​ గ్రామం వద్ద బస్సు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. బస్టాప్​ ను వేగంతో ఢీకొంది. బస్సులో ప్రమాద సమయంలో 40 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో పది మంది వరకూ మృతిచెందారని అధికారులు చెబుతున్నా ఇంకా ధృవీకరించలేదు. 20 మంది వరకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ సింగ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.